సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గైరుహాజరు కావడంతో .. జగన్ ఆయన పార్టీలనుద్దేశించి …అసెంబ్లీ సమావేశాలు ఎవరి కోసమూ ఆగవని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఎం చంద్రబాబు తన ఛాంబర్‌లో కేబినెట్ సమావేశం నిర్వహించారు. 2024-25 వార్షిక బడ్జెట్‌పై కీలకంగా చర్చించారు. బీఏసీ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం చర్చకు వచ్చింది. దీనిపై స్పందించిన సీఎం.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని, ఎవరి కోసమో కాదని అన్నారు. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరగాలన్నారు. బీఏసీ సమావేశంలో రుషికొండ ప్యాలెస్‌పై చర్చ జరిగింది. రుషికొండ ప్యాలె్‌సను గత సీఎం అధికారిక నివాసంగా పేర్కొంటూ జీవో గతంలో విడుదలైందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆయన జీవో ఇచ్చినందున మనం అందమైన రుషికొండ ప్యాలె్‌సను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఛలోక్తి విసిరారు.. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. ‘మరి ఆ ప్యాలస్ కట్టించిన ముఖ్యమంత్రి లేరుగా మరి ఎలాగా ?’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు.
