సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు నేడు, గురువారం అసెంబ్లీ లో డిప్యూటీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన నేపథ్యంలో స్పీకర్ సీటులో ప్రమాణ స్వీకారం చేసారు. ఆయనను సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టి సభ్యులుగా వారు నిలబడి గౌరవించారు. తదుపరి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. చక్కటి తెలుగువారి పంచె కట్టులో స్పీకర్ స్థానంలో కూర్చున్న రఘురామా ను చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. . రఘురామపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘విశాఖపట్నంలో గల ఆంధ్రాయూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేశారని.. డిస్టెన్షన్‌లో రఘురామ పాస్ అయ్యారు. ఎడిబుల్ ఆయిల్లో కూడా ఆయన వ్యాపారం చేశారు. అప్పట్లో సిరీస్ ఫార్మాను ఆయన స్ధాపించారు. డిప్యూటీ స్పీకర్ 2019లో నరసాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఏదైనా ఫ్రాంక్‌గా రఘురామ మాట్లాడుతారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. . అదే రఘరామకు ఇబ్బందులు తెచ్చింది. జగన్ ప్రభుత్వం లో అధినేత నిర్ణయాలతో విభేదించినప్పుడు కావాలంటే పార్టీకి దూరంగా ఉన్నారు. . అయితే రఘురామపై జగన్ ఏవిధంగా కుట్రపన్నారో చూశాం. ఏకపక్షంగా తన సొంత పార్టీ ఎంపీపై లేని రాజద్రోహం కేసును నమోదు చేసి 2021మే 14న ఆయన పుట్టిన రోజున అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందాలని అరెస్టు చేశారు. ఒక ఎంపీని పోలీసు కస్టడీలో టార్చర్ చేయడం సీఐలు, ఐపీఎస్ అధికారులు దీనిలో పాల్గొనడం ఇదే దేశంలో మొదటిది, ఆఖరు సంఘటన కావాలి’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నర్సాపూర్ లోక్‌సభ పరిధిలో భీమవరం లో ప్రధాని మోడీ అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించారు. విగ్రభా ఆవిష్కరణకు వెళ్లాలనుకుంటే రఘురామను వెళ్లనీయలేదు. ఆయన వెళ్తే పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో రైళ్లను తగులబెట్టాలని కుట్ర చేశారు. నియోజకవర్గానికి ఆయనను రానీయకపోతే చివరకు రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయం చెప్పి వారి ఆదరణ పొందారు’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
