సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పరాజయాలతో వెనుకబడిన మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా మట్కా (Matka Review) నేడు, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, సలోని, కిశోర్, నవీన్ చంద్ర సత్యం రాజేశ్, జాన్ విజయ్, నోరా ఫతేహి, అజయ్ ఘోష్, తదితరులునటించగా . ‘పలాస’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నకరుణకుమార్ దర్శకత్వంవహించారు. నిర్మాతలు: విజయేంద్రరెడ్డి తీగల, రజనీ తాళ్లూరి.. ఇక సినిమా కధ విషయానికి వస్తే 1960 నుండి పిరియాడికల్ గా సినిమా కధ మొదలవుతుంది. బర్మా నంచి వైజాగ్‌కు శరణార్ధిగా వచ్చిన వాసు (వరుణ్‌తేజ్) అనే యువకుడు కథ ఇది. చిన్నప్పుడే ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్తాడు వాసు. జైలు వాతావరణంలో మొరటుగా తయారు అవుతాడు. జైలు నుంచి తిరిగొచ్చి విశాఖపట్నం చేరతాడు. అక్కడ పూర్ణ మార్కెట్లో కూలీగా పనికి చేరి . యజమాని అపల్పరెడ్డి (అజయ్ ఘోష్)ని రక్షించి, ఆ వ్యాపారంలో షేర్ తీసుకుంటాడు. అక్కడి నుంచి వ్యాపారంలో ఒక్కో మెట్టు ఎక్కి మట్కా కింగ్ గా మారతాడు. ఈ తరుణంలో అతనికి శత్రువులు పెరుగుతారు. దాని వల్ల ఎవాసు ఏం కోల్పోయాడు.. ఏం సాధించారు అనేది మిగిలిన కథ. ఇక సినిమా ఎలా తీశారంటే.. నిజంగా కళా దర్శకుడుని అభినందించాలి. నిజంగా పిరయాడికల్ కాలానికి చెందిన సెట్స్ దుస్తులు ఫై చాల శ్రద్ద పెట్టారు. జైలర్ (రవిశంకర్) వాసు ధైౖర్యాన్ని, బలాన్ని తెలుసుకుని అతని ద్వారా డబ్బు సంపాదించడం ఇంట్రెస్టింగ్గా సాగాయి. వాసు పూర్ణ మార్కెట్‌కి రావడం, తన విరోధులను కొడుతూ ఎదగడం, ఇంట్రవెల్‌కి ముందు మట్కా ఆటని పరిచయం చేయడం ఇలా కథ సాగుతుంది. కష్టమైన ఈ ఆటను సింపుల్‌గా అర్థమయ్యేలా ఆ సీన్ డిజైన్ చేశారు. అయితే కథనంలో వేగం లేదు. ముందు ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. . ఇక సెకెండాఫ్‌కు వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారిన మట్కా ఆట కట్టించేందుకు దాన్ని నడిపించే వాసును పట్టుకునేందుకు సీబీఐ చేేస ప్రయత్నాలు .. విరోధులు వేసే ఎత్తులు ప్రేక్షకులను అంత ఆకట్టుకునేలా లేవు. కూతుర్ని కూర్చోబెట్టుకొని ‘మేక’ కథ చెప్పే సీన్ అయితే నీరసం తెప్పిస్తుంది.హీరోయిన్. హీరోల మధ్య ప్రేమకథ కూడా అంత బలంగా అనిపించలేదు. విభిన్నంగా కనిపించడనికి వరుణ్ తేజ్ పడిన కష్టం అపురం. వయస్సు రీత్యా పాత్రల వేరియేషన్స్‌కు తగ్గట్టు అన్నింటికి న్యాయం చేశాడు. నటుడిగా బాగా ఎదిగాడు. కథ, కథనాల్లో లోపం వల్ల ఆ కష్టం పూర్తి స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. వరుణ్ యాక్షన్ కోసం కొన్ని అపూర్వ సన్నివేశాల కోసం సినిమా చూడొచ్చు.
