సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 12వ తేదీ ఏర్పడి స్థిరంగా కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. అయినప్పటికీ ఉత్తర తమిళనాడు కోస్తాతీరం నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకి సమీపంలో తాజగా మరో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి నెలకొంది. ఈ కారణంగా తిరువళ్లూరు, వేలూరు, ఆంధ్ర ప్రదేశ్ లో దక్షిణ కోస్తా రాయల సీమా ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావారణ కేంద్రం తెలిపింది. అయితే కేరళ సముద్రతీర ప్రాంతానికి సమీపంలో ఆగ్నేయ అరేబియా సముద్రంలో బాహ్య ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది.ఈ నెల 15న 16వ తేదీన రాయలసీమతో పాటు నీలగిరి, కోయంబత్తూరు, తిరుపూరు, తేని, దిండిగల్ జిల్లాల సహా చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు.
