సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలయ్య ఇటీవల వరుస హ్యాట్రిక్ విజయాల తరువాత ‘NBK109’. సినిమా ఫై ఇండస్ట్రీ లో అంచనాలు పెరిగాయి. అదికాక దీనికి వాల్తేర్ వీరయ్య తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. అయితే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదలైంది. కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా చిత్ర టైటిల్‌ని ప్రకటించడంతో పాటు, టీజర్‌ను కూడా విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) అనే శక్తివంతమైన టైటిల్‌ను పెట్టారు. నేడు, శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో ఈ టీజర్ విడుదల కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ‘‘96 సెకన్ల నిడివితో ఉన్న ఈ ‘డాకు మహారాజ్’ టీజర్.. సినిమాపై మరింతగా మాస్ అంచనాలను పెంచేస్తోంది. ‘ఈ కథ వెలుగును పంచే దేవుళ్లది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులని ఆడించే రావణుడిదీ కాదు. ఈ కథ.. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది’ అంటూ ‘డాకు మహారాజ్’గా బాలకృష్ణను గుర్రం ఫై స్వారీ చేస్తూ పరిచయం చేసిన తీరు బాగుంది. .
