సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల లోక్ సభ ఎన్నికలలో 2 నియోజకవర్గాల నుండి ఎంపీ గా గెలుపొందిన రాహుల్ గాంధీ తాను వదులు కొన్న కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో నేడు, శనివారం ఓట్ల కౌంటింగ్ లో ఉపఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా బంపర్ మెజార్టీతో అంటే ఏకంగా 4,04,619 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రియాంక గాంధీకి మొత్తం 6,12,020 ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరీ నిలిచారు. ఆయనకు 2,07,401 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఆమె 1,08,940 ఓట్లు సాధించారు.
