సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీకి తమినాడుకు తుపాను ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఈ నెల 25వ తేదీకల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడనుంది..అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లోఏపీలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, అల్పపీడనం బలపడి తమిళనాడు తీరం దిశగా రానున్నందున ఈనెల 27 నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పెరగనున్నాయి. 27న నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయి. 28. 29న అనకాపల్లి, గోదావరి జిల్లాలు , నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో, భారీవర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. కాగా వాయుగుండం తీరం దిశగా వచ్చే అవకాశం ఉన్నందున వరి కోతలు కోసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ప్రకటించింది.
