సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలలు అయిన ఉన్నత విద్యా సంస్థలలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల పీజు రీయింబ ర్స్‌మెంట్ విషయం ఇంకా ఊగిసలాటలో ఉండగా ఇప్పటికే కాలేజీలకు చెల్లించవలసిన పాత బకాయిలు 100 కోట్ల కు పైగా పెరిగిపోయాయి. అయితే తాజాగా ప్రభుత్వ ఉత్తర్వులతో విద్యా ర్థులకు, అటు కాలేజీల యాజమాన్యాలకు భారీ ఊరట లభించింది. అయితే గతంలో మళ్లే జిల్లాలోని సుమారు 35వేలు మంది పైగా విద్యార్థుల తల్లుల ఖాతాల లోకి కాకుండా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును కళాశాలల ఖాతాలకే జమ చెయ్యాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు లోకి తీసుకురానుంది. గతంలో కొందరు విద్యార్థుల తల్లి తండ్రులు ఖాతాలలో డబ్బు పడినప్పటికీ సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందులు పడేవి. అదికాక ప్రతి 3 నెలలకు విద్యార్థుల తల్లి తండ్రులు తమ నిర్ధారణ పత్రాలతో సచివాలయాలు వెళ్లి వేలిముద్రలు వేసే ఇబ్బందులు తప్పాయి. ప్రతి ఏటా పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు రూ.100 కోట్లు మేర ప్రభుత్వం తల్లుల ఖాతాలో జమ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది పలు కాలేజీలలో ఫీజులు భారీగా పెరిగాయి. దీంతో అదనంగా ప్రభుత్వం పై మరిన్ని కోట్లు భారం పడే అవకాశం ఉంది.ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం 60 శాతం ఫీజు చెల్లిస్తోంది. మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయితే విద్యార్థుల హాస్టల్ వసతి దీవెన పధకం ఫై మాత్రం ఇంకా సమాచారం లేదు. ఇప్పటికే జిల్లాలోని స్థానిక సచివాలయాలలో పీజురీయింబర్స్‌మెంట్ అర్తల కోసం మరోసారి విద్యార్థుల నిర్ధారణ సమాచార సేకరణ పూర్తీ కావస్తుంది.
