సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహారాష్ట్రలోఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం అందులోను మ్యాజిక్ ఫిగర్ కు కావలసిన 145 స్థానాలకు బీజేపీ ఏకపక్షంగా 130 కి పైగా స్థానాలు గెలుపొందడం తో సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నిక ఇక లాంఛనం కాబోతుంది. తాజా సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను (Devendra Fadnavis) సీఎం చేసేందుకు అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ అంగీకరించింది. అయితే ప్రస్తుత శివసేన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి షిండే శిబిరంలోని వారి ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde) ఉండాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పధకాల వల్లే విజయం సాధించామని పైగా ఏక్‌నాథ్ షిండే సీఎం కావడం వల్ల బీఎంసీ ఎన్నికల్లోనూ, ఇతర మున్సిపల్ ఎన్నికల్లోనూ లాభదాయకంగా ఉంటుందని షిండే క్యాంపు డిమాండ్ చేస్తుంది. ఇదే క్రమంలో మహారాష్ట్రలో ఒక సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములా మళ్లీ రిపీట్ కావచ్చని రాజకీయ వర్గాల సమాచారం. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయం. ఏదిఏమైనా రాజకీయాలలో ప్రస్తుత బల బాలలు బట్టి ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులు కావచ్చని భావిస్తున్నారు.. పైగా బీజేపీ కోటాలో దాదాపు 20-22 మంత్రి పదవులు రానున్నాయి.
