సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పంచారామాలలో అతి విశిష్టమైనది భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు పవిత్ర కార్తీకమాసోత్సవములు సందర్భముగా 24వ రోజు నేడు, 4వ సోమవారం నేపథ్యంలో తెల్లవారు జాము 3గంటల నుండి భక్తులు రికార్డు స్థాయిలో వేలాదిగా తరలివచ్చారు. వేగంగా శ్రీ స్వామివారి దర్శనం జరిగింది.నేడు, రూ.200/-ల దర్శనం టిక్కెట్ల అమ్మకాలు వలన రూ.3,46,200/-లు రూ.100/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.3,80,200/-లు, రూ.50/-ల దర్శనం టిక్కెట్ల వలన రూ.1,36,800/-లు, లడ్డుల వలన రూ.43,500/-లు, అన్నదానం ట్రస్టు నిమిత్తం రూ.1,85,723/-లు, మొత్తం రూ.10,92,423/-లు వచ్చి యున్నది. ఈరోజు అన్నదానం ట్రస్టు ద్వారాఏకంగా 15,000 మందికి అన్నప్రసాదం వితరణ చేశామని కార్యనిర్వహణాధికారి డి రామకృష్ణంరాజు తెలిపారు.
