సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు, బుధవారం గత 40 రోజులు నుండి 20 రోజుల నుండి శ్రీ అమ్మవారి మాల ధారణతో నిష్ఠగా దీక్ష కొనసాగిస్తున్న400 మంది పైగా అమ్మవారి భక్తులు దీక్ష విరమణ మరియు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో,శ్రీ అమ్మవారికి ఆవు నెయ్యభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ 400 మంది భక్తులు పైగా దీక్ష విరమణ ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో , భక్తులందరికి అన్నసమారాధన,మరియు శ్రీ అమ్మవారి యొక్క ప్రత్యేక ప్రసాదాలు అందజేశారు. ఈసారి శ్రీ అమ్మవారి దీక్ష దారులు గతానికి బిన్నంగా ఎన్నో విశిష్ట వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి శ్రీ అమ్మవారి దీక్ష ధారణ విశిష్టతను మరింత విస్తృతం చేసారు. దానికి దేవస్థానం దేవాదాయ శాఖ ,కూడా తన వంతు తోడ్పాటు ను అందించిందనే చెప్పాలి
