సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక బుధవారం మార్కెట్ సెంటర్ లో ఒక వ్యక్తి నేటి బుధవారం మధ్యాహ్నం అక్కడ 11కేవీ పవర్ టవర్ ఎక్కి సృష్టించిన హడావిడి అంత ఇంతా కాదు.. అక్కడ నుండి దూకేస్తాడేమో అని అందరు హడలి పోయారు. ఎట్టకేలకు నేటి రాత్రి 8 గంటల ప్రాంతంలో కొద్దీ సేపుపవర్ కూడా నిలిపివేసి వన్ టౌన్ పోలిసుల కృషి ఫలించి అతను క్షేమంగా క్రిందికి దిగటం జరిగింది. ప్రాధమిక సమాచారం ప్రకారం.. ఇంత హడావుడి చేసిన వ్యక్తి వసంతరావు అని గుర్తించి అతను వ్యసన పరుడుగా మారాడని అతను చేసే పనికిమాలిన పనులకు గత కొంత కాలంగా స్థానికంగా చుట్టూ ప్రక్కల ప్రజలు వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పోలీసులు అతనిని మరో సారి ఇటువంటి పనులు చెయ్యకుండా శిక్షించాలని స్థానికులు, వ్యాపారులు కోరుతున్నారు.పూర్తీ వివరాలు ఇంకా తెలియవల్సి ఉంది.
