సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఏ టీవీ ఛానెల్ చుసిన వర్మ కోసమే బులిటెన్స్..వివాదం లేకపోతె నిద్ర పట్టని వర్మ కోరుకొనేది ఇదే.. గతంలో తన సినిమాలలో క్షణ క్షణం నుండి దౌడ్, అనగనగ ఒక రోజు, సర్కార్ తదితర ఎన్నో సినిమాలలో పోలిసుల నుండి హీరో తప్పించుకొనే సన్నివేశాలు అద్భుతంగ చిత్రీకరించిన సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma) ఇప్పుడు నిజ జీవితంలో తాను అదే పని మరింత రంజుగా చేస్తున్నారు. ఆయన ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోవర్మపై 9 కేసులు నమోదయ్యాయి. అతని కోసం ఒంగోలు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీస్ బృందాలను పంపారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ కోసం ఆయన తరఫు న్యాయవాది గత బుధవారం హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. దానిపై నేడు గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది.. ఈనెల 25న ఒంగోలు పీఎస్‌లో విచారణకు రావాల్సి ఉండగా.. అదే రోజు ఆయన విచారణకు రాకుండా గైర్హాజరయ్యారు. అప్పటి నుంచి పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.రెండు రోజుల క్రితం రాంగోపాల్ వర్మ చక్కగా పెద్ద మగ్గులో కాపీ తాగుతూ ఒక వీడియో విడుదల చేశారు. తానెక్కడికి పారిపోలేదని, వీడియో ద్వారా తనను విచారణ చేసుకోవచ్చునని అయితే తాను పోస్టు ఎవరి ఉద్దేశించి పెట్టానో.. వారికి కాకుండా ఇంకెవరో సంబంధం లేని థర్డ్ పార్టీ వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు తనకు ఎలా వర్తిస్తాయనేది తనకు అర్ధం కావట్లేదని అన్నారు.. పోలీసులను ప్రశ్నిస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
