సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం కామిడి సినిమాలు మాత్రమే కాదు గాలి శ్రీను, సైకో క్యారెక్టర్స్ వెయ్యడం లో తన సత్తా గతంలోనే చూపించిన ‘అల్లరి నరేష్’ ఇటీవల మహర్షి నుండి సరికొత్త సీరియస్ కథ చిత్రాలకు నాంది’ పలికాడు.. కామెడీని పక్కనపెట్టి కొత్త కథలతో సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నాడు. త్వరలో అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ అనే సినిమాతో తనకు నచ్చినట్లు బ్రతికే ఒక ఫుల్ మాస్ క్యారెక్టర్ లో రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. తాజాగా నేడు బచ్చల మల్లి టీజర్ రిలీజ్ చేసారు.. సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది.
