సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ యువీ కృష్ణంరాజు జయంతి సందర్బంగా భీమవరం డిఎన్నార్ కళాశాల వద్ద యుకె ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు మాజీ కేంద్ర మంత్రి, స్థానిక మాజీ ఎంపీ రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి తెలిపారు. నేడు, శుక్రవారం భీమవరం బ్యాంక్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ను కలిసి ఆహ్వానించారు. ఈ మెగా మెడికల్ క్యాంప్ లో డయాబెటిక్ పరీక్షల కోసం ప్రత్యేకంగా లండన్ నుంచి 20 మంది వైద్యులు వస్తున్నారని, ఈ మెగా మెడికల్ క్యాంప్ కు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్య కుమార్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఏపిఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి తదితరులు ప్రముఖులు హాజరుకానున్నారని తెలిపారు.
