సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యా ణ్ తిరిగి సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నారు. తాజగా.. హరిహర వీరమల్లు షూటింగ్ లో అడుగు పెట్టారు. ఇక జనవరి నెల నుండి మోస్ట్ క్రేజీయెస్ట్ ఫిల్మ్ OG. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేసారు మేకర్స్. పవన్ లేని సన్నివేశాలు షూటింగ్ హైదరాబాద్ లో చేస్తున్నారు. DVV దానయ్య నిర్మి స్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడికల్ హై యాక్షన్ సినిమాలో ఇప్పటికే ఆయన తనయుడు అకిరా ఒక కీలక పాత్రలో కనిపిస్తుండగా.. మరోక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అడుగు పెడుతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో కథలో ఫ్లాష్ బ్యాక్ లో ఓ డైనమిక్ డాన్ క్యారక్టర్ కోసం ప్రభాస్ ను సంప్రదించగా ఆయన దర్శకుడు సుజిత్ కోసం అంగీకరించాడని సమాచారం.. గతంలో ప్రభాస్ తో సుజీత్ 400 కోట్ల వసూళ్లను సాధించిన “సాహో” ను తెరకెక్కించారు, ఆ స్నేహం తో ప్రభాస్ అతిధి పాత్రకు ఓకే అన్నారని ఫిల్మ్ నగర్ సమాచారం.. అయితే పవన్ తో కలసి సన్నివేశాలు ఉంటాయో లేదో? లేదా పవన్ కు మిత్రుడుగా కనిపిస్తారో? మొత్తానికి సినిమా మీద హైప్ మాములుగా పెరగవు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *