సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేటి సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం అయ్యారు. ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల కాకినాడలో రేషన్ బియ్యం మాఫియా పైనా సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు కీలకంగా కూటమి తరపున రాజ్యసభ సభ్యుల ఎంపికపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకొచ్చినట్లు సమాచారం..ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో.. ఉప ఎన్నికలు జరగనున్నాయి.. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో అసలు ప్రాతినిథ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ అవ్వాలని భావిస్తోంది..తాజగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తి రేపింది.. ఈ భేటీలో రాజ్యసభకు జనసేన తరపున ఒక అబ్యర్ధి గా సోదరుడు నాగబాబు పేరును పవన్ ప్రతిపాదించినట్లు భావిస్తున్నారు. అయితే.. రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి వైసీపీ కి రాజీనామా చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్, అశోక్ గజపతిరాజు కూడా పోటీలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.. బీజేపీ పార్టీ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం.. మరి ఆ 3 రాజ్యసభ సీట్లు ఎవరికీ కేటాయిస్తారా చూడాలి..
