సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రయాణికులకు వాహనదారులకు ముఖ్య గమనిక.. ఈనెల 9వ తేదీ నుండి 18 వరకు 10రోజుల పాటు ఆకివీడు వెళ్లే ప్రధాన రహదారిలో ఉండి రైల్వే గేట్ మూసివేయ్యనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పది రోజులు భీమవరం నుండి ఏలూరు లేదా కృష్ణ జిల్లా వైపు వెళ్లాలనుకొనే ప్రయాణికులు ఉండి వద్దనే గణపవరం వైపు వెళ్ళవలసి ఉంటుంది. లేదా జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్ళాలి.. ఏపీ ఆర్టీసీ బస్సు లకు ఇది వర్తిస్తుంది. కావున అటు వైపు వెళ్లే ప్రయాణికులు దీనిని గమనించి ప్లాన్ చేసుకోవాలి.
