సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి(ఎమ్మెల్సీ) ఉప ఎన్నికల పోలింగ్ రేపు గురువారం జరగనుంది. గతంలో ఎన్నికల్లో యూటీ ఎఫ్ తరపున గెలిచిన షేక్ సాబ్జి భీమవరం సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఉప ఎన్నిక అని వార్య మైంది.( ఈ ఎన్నికలో గెలుపొందిన ఎమ్మెల్సీ పదవి కాలం కేవలం 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే ఉంటుంది.)రేపటి ఎన్నికలకు పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశా రు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్ నిర్వ హిస్తారు. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరగనున్నాయి. ఐదుగురు అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో ఉన్నారు. యూటీ ఎఫ్ నేత బొర్రా గోపీమూర్తి, గంధం నారాయణరావు, డా.కవల నాగేశ్వరరావు, పులుగు దీపక్, నామన వెంకట లక్ష్మి(విళ్ల లక్ష్మి) పోటీ పడుతున్నారు.. ఆరు జిల్లాల పరిధిలో 116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.16,737 మంది టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.వీరిలో పశ్చిమగోదావరి జిల్లాలో 3729,ఏలూరు జిల్లాలో 2667 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను కాకి నాడ జేఎన్‌టీయూ స్ట్రాంగ్ రూమ్ కు తరలించనున్నారు. ఈనెల 9వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ నెల 12వ తేదీతో ఎన్నికల కోడ్ ముగు స్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి జిల్లాలో నేడు, బుధవారం రేపు గురువారం 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు
