సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాను విదేశాలకు వెళ్లకుండా సీఐడీ ఇంటర్ పోల్ ఆదేశాల నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా మండిపడుతూ.. స్కామ్ లు చేసి చంద్రబాబు 55 రోజులు జైలులో ఉన్నాడని, ఇప్పుడు సీఎం అయ్యాక వైసీపీ నేతలు అందరు జైలులో పెట్టాలని కోరుకొంటున్నాడు. అతని తప్పుడు కేసులకు భయపడేది లేదని నిన్న గర్జించినవైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గతం నుండి పవన్ ను విరామర్శించాలంటే ఆచితూచి అడుగులు వేస్తుంటారు. తాజగా ఆయన ప్యూహాత్మకంగా చేసిన ట్విట్ లో .. జాతీయ స్థాయిలో పాప్యులారిటీ, వయస్సు రీత్యా రాష్ట్రాన్ని నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ నాయకత్వాన్ని మార్చండి.. ఏపీలోని ఎన్‌డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని ఆయన ప్రశంసించారు.. ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు 75 ఏళ్ల వృద్ధుడైన చంద్రబాబు నాయకత్వం వహించలేరని దెప్పి పొడిచారు..
