సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సమ సమాజ నిర్మాణ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు ఎనలేనివని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర అనంతరకాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని, ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందు పరచడంలో అంబేద్కర్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని అన్నారు. అయన జీవితం అందరికి ఆదర్శనీయమని అన్నారు. కార్యక్రమంలో పొత్తూరి బాపిరాజు, వబిలిశెట్టి రామకృష్ణ, భీమాల శ్రీరామూర్తి, కారుమూరి సత్యనారాయణ మూర్తి, విజ్జురోతి రాఘవులు, తాతపూడి రాంబాబు, గొర్ల గోపి, లవరాజు, జనసేన టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
