సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం వాతావరణ శాఖ కు అందిన సమాచారం మేరకు ఆగ్నేయం బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దాని ప్రభావంతో రేపు శనివారం డిసెంబర్ 7వ తేది నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల్లో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం మీదుగా డిసెంబర్ 12 నాటికి శ్రీలంక-తమిళనాడు తీరాల వద్దకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య/తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. దీంతో రాగల మూడు రోజుల్లో కోస్తా ఆంధ్ర లో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడనున్నాయి.
