సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పూర్తీ అయ్యింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి కాకినాడ జేఎన్‌టీయూలో నేడు, సోమవారం ఉదయం నుండి కౌంటింగ్ ప్రక్రియ జరిగింది ఎమ్మెల్సీ గా భీమవరం పట్టణానికి చెందిన పీడీఎఫ్ అభ్యర్థి గోపీ మూర్తి (PDF MLC Gopi Murthy) విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే పీడీఎఫ్ అభ్యర్థి మూర్తికి అధికంగా ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన 15490 ఓట్లలో మూర్తికి 8, 929 తొలి ప్రాధాన్యతా ఓట్లు లభించాయి. ప్రతి టేబుల్‌లో వెయ్యి ఓట్లకు 600 పైగా ఓట్లు గోపి మూర్తికే దక్కాయి. తాజగా గోపీ మూర్తి ఎమ్మెల్సీ గా ఎన్నిక కావడంతో భీమవరం నుండి రాష్ట్ర శాసనమండలి లో చైర్మెన్ మోషేను రాజు తో పాటు వైసీపీ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ తో కలపి ముగ్గురు ఎమ్మెల్సీ లు ఉండటం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *