సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ నేడు, సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా తయారు అయ్యిందని, అభివృద్ధి కుంటుపడిందని, అన్ని ధరలు పెరిగిపోయాయని , ప్రజలకు ఆదాయాలు లేవని గత వైసీపీ పాలనే బెటర్ అంటూ అందరు భావిస్తున్నారు అన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌ ను నిర్వహించడం తో గతంలో వైసీపీ హయాంలో నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో ప్రభుత్వ స్కూల్స్ ఆధునీకరణ ఫలితాలు కనిపించాయంటూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు , కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖలో వేలకోట్ల డ్రగ్స్ వ్యవహారంపై నిందితులను బయట పెట్టాలని తాను మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ‘‘డ్రగ్స్‌కు సంబంధించి మాపై విష ప్రచారం చేశారు.. ఎన్నికల్లో లబ్ధి పొందారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఫై ప్రజల సమస్యలపై ప్రభుత్వ హామీల అమలు ఫై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. రైతాంగం ఇబ్బందులపై ఈనెల13 వ తేదీన అన్ని కలక్టరేట్‌లో వినతిపత్రలు అందజేస్తామన్నారు. ఈనెల 27వ తేదీన విద్యత్ చార్జీలు పెంపుపై విద్యుత్ కార్యాలయాలలో వినతిపత్రలు అందజేయనున్నట్లు తెలిపారు. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అమ్మవడి, ఫీజ్ రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జనవరి 3న ఉద్యమిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *