సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం హైదరాబాద్ లో అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలను దేశం యావత్తు ఆసక్తిగా మీడియా ఛానెల్స్ లో చూస్తుంది. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పుష్పసినిమాలతో తెలుగువాడి సత్తా దేశానికీ చాటిన నేపథ్యంలో.. జాతీయ పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ అరెస్ట్ అవడం..ప్రభుత్వ పాలకుల అభద్రతా భావానికి ఇది పరాకాష్ట అని చెప్పుకొచ్చారు.నిజానికి త్రోపులాటలో మహిళా మృతి కి .. ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయటం సరికాదన్నారు. ప్రభుత్వ చర్యను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టు ను న్యాయవాదులు కోరారు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో న్యాయవాదులు నిరంజన్ రెడ్డి,( వైసీపీ ఎంపీ) అశోక్ రెడ్డి మెన్షన్ చేశారు.ఎల్లుండి ఆదివారం సెలవు దినాలు కావడం వల్ల వచ్చే సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. పోలీసులను అడిగి చెబతామని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. విచారణ నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది.
