సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: .విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నేడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ..‘‘ చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి పధంలో పయనిస్తుంది ఆ నమ్మకం నాకుంది. నా ముక్కుసూటితనం వల్ల కూడా రాష్ట్రానికి మంచే జరగాలి’’, ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారధ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని విజన్ ఉన్న నేత .. స్వర్ణాంధ్ర సైబరాబాద్ రూపకర్త, శిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబే అంటూ పవన్ అభినందన వర్షం కురిపించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ కోట్లాది మంది కలలను సాకారం చేసే మహాసంకల్పమన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువేంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. పార్టీ నడపటం అంటే ఆత్మహత్యా సద్రుశ్యంతో సమానమన్నారు. ప్రతీ ఒక్కరికీ సహన, దిక్సూచీ అవసరమన్నారు. చంద్రబాబు విజన్ 2020 నాడు తన స్థాయికి అర్థం కాలేదని.. చంద్రబాబు ఆయన కోసం కలలు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్న మహానాయకుడని విజన్ 2020 ఫలితాల ద్వారా అర్థమైందన్నారు. ఎంతో కష్టపడి కట్టిన ట్విన్ టవర్స్‌ను ఉగ్రవాదులు ఒక పూటలోనే కూల్చేశారని.. నిర్మాణం విలువ తెలియని గత పాలకులూ ఇదే మాదిరి వ్యవహరించారన్నారు. . అలాంటి అనుభవజ్ఞుడి వద్ద పనిచేయటం ఎంతో గర్వంగా ఉంది’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *