సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరికి అతి సమీపంలో ఉన్న తెలంగాణకు చుట్టుతిరిగి కాకుండా ఇకపై చాలా దగ్గర మార్గంలో అతి త్వరలో కొండలు అడవులు మీదుగా మరో రైల్వే లైన్ వెయ్యడానికి తాజగా కేంద్రం పచ్చ జెండా ఊపింది. 65 ఏళ్లు క్రితం ప్రకటించిన రైల్వే లైన్ .. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నుండి భద్రాచలం రైల్వే రోడ్డు లైను నిర్మాణానికి వీలుగా 2 వేల 155 కోట్లు ప్రతిపాదిత వ్యయం గుర్తించి మంజూరు చేస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజగా ప్రకటించారు వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజగా రాజమహేంద్ర వరం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి రాతపూర్వ కంగా తెలిపారు.ఇప్పటికే లైన్ సర్వే కు 40 కోట్లు ఖర్చుపెట్టింది కేంద్రం. అయితే ఇంతకుముందున్నరైల్వే లైన్ మారి ఇప్పుడు తాజాగా టి.నర్సాపురం, పుట్టగట్లగూడెం మీదుగా హైవే లైను వెళ్లబోతుంది. ప్రత్యేకించి ఈ రైల్వే మార్గం నిడివి 165 నుంచి 119 కిలోమీటర్లకు తగ్గింది కూడా దీంతో సింగరేణి కొత్తగూడెం–సత్తుపల్లి బొగ్గు గనులు నుండి రవాణా సౌకర్యం కూడా మరింత పుంజుకొంటుంది. ఇక సుందరమైన ఏజెన్సీ ప్రాంతాల మీదుగా రైళ్లు ప్రయాణించే రోజులు అన్ని అనుకున్నట్లు జరిగితే మరో 5ఏళ్లలో ఉన్నాయి
