సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పదవులు బాధ్యతలు మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గా రుద్రరాజు పుల్లంరాజు, వైస్ ప్రెసిడెంట్ జక్కంపూడి సతీష్ లు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నేడు, మంగళవారం ఉదయం వారిని ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. నీటి సంఘాలు అంటేనే రైతులకు మేలు చేసే సంఘాలని, ఎప్పటికపుడు రైతులకు మేలు చేసే విధంగా బాధ్యతయుతంగా పని చేయాలని అన్నారు. బాధ్యతలకు ఐక్యత ఎంతో ముఖ్యమని, ఐక్యతతో పని చేసి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. పుల్లంరాజు, సతీష్ మాట్లాడుతూ ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో పని చేస్తామని అన్నారు. కమిటీ సభ్యులుగా చిడే కృష్ణవేణి, పెంటపాటి శివరామిరెడ్డి, కలిదిండి అప్పలరాజు లు ఎన్నికయ్యారు.
