సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్య మం త్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన్మదినం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు విశేషంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు కూడా ఎక్స్ వేదికగా జగన్‌కు హృదయపూర్వక శుభాకాం క్షలు తెలిపారు. జగన్ ఎప్పుడూ ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో జీవించాలని అని ఆకాంక్షిస్తూ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇక వివాదాస్వాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు.. వచ్చే ఏడాది మిమ్మలిని మరింత శక్తి వంతం చేస్తుంది అని ట్విట్ చేసారు.
