సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి.. గృహ నిర్మాణ ఎలక్ట్రికల్ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో ఒక వ్యక్తి శవం బయట పడిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతటి సంచలనం కలిగించిందో అందరికి తెలిసిందే. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర వర్మ అలియాస్ సిద్ధార్థ వర్మ యొక్క ఫోటో మరియు నేరం జరిగిన అనంతరం అతడు ప్రయాణించిన ఎరుపు కారు యెుక్క ఫోటోలను జిల్లా పోలీసు శాఖ నేడు, సోమవారం విడుదల చేసింది. కావున ఎవరైనా ఫై ఫోటోలో చూపబడిన వ్యక్తి గాని లేదా కారు గాని గుర్తించిన ఎడల తక్షణమే జిల్లా పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా జిల్లా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎస్ఐ ఉండి పోలీస్ స్టేషన్: 9440796648
సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకివీడు : 9154966508
డీఎస్పీ భీమవరం : 9154966497
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్: 9154966504
