సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం సమీపంలోని ఉండి మండలం యండగండిలో మృతదేహం పార్శిల్ కేసులో కీలక నిందితుడు శ్రీధర్ వర్మను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. అతడిని ప్రస్తుతం భీమవరం తరలించి నేడు, మంగళవారం విచారిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు తెలియజెయ్యవలసి ఉంది. .ప్రాధమిక సమాచారం ప్రకారం.. పక్కా స్కెచ్‌తోనే రోజు వారీ కూలీ అయిన పర్లయ్య, ను శ్రీధర్ వర్మ ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మకు ఏకంగా మూడు పేర్లు, ముగ్గురు భార్యలు ఉన్నట్లు ప్రాధమిక సమాచారం. శ్రీధర వర్మకు రెండో భార్య రేవతికి అక్క అయిన యండగండి లో నివాసం ఉంటున్న సాగి తులసితో ఆస్తి కోసం తగాదా ఏర్పడింది. తులసిని బెదిరించి ఆస్తి లాక్కునేందుకు వదినను భయబ్రాంతులకు గురిచేసేలా ప్లాన్ చేసాడని దానిలో భాగంగా తనదగ్గర పనికి వచ్చిన అమాయకుడు కూలి పర్లయ్య ను బహుశా ఈనెల 17వ తేదీన హత్య చేసి శవపేటికలో పర్లయ్య మృతదేహాన్ని ఉంచి 20వ తేదీన స్వయంగా శ్రీధర్ బాబే తీసుకువచ్చి సాగి తులసి ఇంటికి పార్సిల్ లో తీసికొనివచ్చి తరువాత కారులో పరారైనట్లు? భావిస్తున్నారు. ఇందులో పెద్ద ట్విస్ట్లు ఏమిటంటే.. హత్యకు ముందు 2 శవపేటికలు సిద్ధం చెయ్యడం. రెండో శవపేటికను శ్రీధర్ వర్మ మూడో భార్య ఇంట్లో పోలీసులు గుర్తించారు. అలాగే ఈ కేసులో నిందితుడి మూడో భార్య కూడా నిందితురాలిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మూడో భార్య ఇంట్లోనే పర్లయ్యను హత్య చేసి తన వదిన సాగి తులసి ఇంటికి పంపినట్లు కూడా మరో అనుమానం ఉంది.
