సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2024 సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమ అంటే ఇక ఇదే భారతీయ సినిమాగా తిరుగులేని సత్తా చాటింది. దేశం అంతటా కనకవర్షాన్ని కురిపించింది. చిన్న హీరోల సినిమాలు కూడా రూ.100 కోట్లు అవలీలగా దాటేశాయి. ఇక పెద్ద సినిమాలు అయితే బాహుబలి 2 టార్గెట్ గా రూ. 2000 కోట్లు వైపు పరుగులు తీస్తూ ఇండియన్ బాక్సాఫీస్‌ని ఆశ్చర్యపరిచాయి. అసలు టాలీవుడ్‌కి 2024లో వచ్చిన భారీ హిట్ సినిమాలను ఒక్కసారి పరిశీలిస్తే.. గత సంక్రాంతికి మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’, 200 కోట్లు పైగా నాగార్జున ‘నా సామిరంగ’ 25 కోట్ల వసూళ్ల చిత్రాలతో ఈ ఏడాది సంక్రాంతి విజయాలను అందుకున్నారు. ఇక చిన్నసినిమాగా బరిలోకి దిగిన ‘హను-మాన్’ పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. రూ.30కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ. 300 కోట్లకు పైబడి వసూళ్లను సాధించి అద్భుతం చేసింది. ‘టిల్లూ స్క్వేర్’ చిత్రంతో యువహీరో సిద్ధు జొన్నలగడ్డ రూ. 120 కోట్ల వసూళ్లతో మరో విజయాన్ని సాధించారు. ఇక పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన పవర్ చూపించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడి’ చిత్రం రూ. 1100 కోట్ల వసూళ్ల క్లబ్లో చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శివ కొరటాల దర్శకత్వం వహించిన ‘దేవర 1’ సినిమా టాలీవుడ్‌తో పాటు హిందీ లోనూ ఘన విజయం తో 450 కోట్ల క్లబ్ లో చేరింది. నాని హీరోగా సూర్య ప్రధాన పాత్రలో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘సరిపోదా శనివారం’తెలుగులో పర్వాలేదనిపించింది. హిందీలో నాని సినిమాకు అసలు టికెట్స్ తెగడం లేదు. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘క’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క తెలుగులోనే ఈ చిత్రం రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. రూ. వందకోట్ల వసూళ్ల తో అదరకొట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటికే హిందీ సినిమా రికార్డ్స్ అన్ని చిత్తకొత్తేసాడు పుష్పరాజ్.. ఇక బాహుబలి 2 , దంగల్ కు చేరువగా రూ. 2 వేల కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తున్నాడు పుష్ప రాజ్.
