సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ శ్రేణులు ఊహించినట్లే రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన భార్య పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. నేడు, సోమవారం కృష్ణాజిల్లా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులో పోలీస్ విచారణకు సహకరించా లంటూ పేర్ని జయసుధకు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. పోట్లపాలెంలో పేర్ని నాని తన భార్య జయసుధ పేరు మీద.. బఫర్ గోడౌన్ నిర్మించి అద్దెలకు ఇచ్చారు. ఇటీవల ఆ గోడౌన్లలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే గోడౌన్లో ఉన్న బియ్యం నిల్వకు.. అధికారిక పత్రాల్లో ఉన్న నిల్వలకుతేడా ఉండటంతో ఆ క్రమంలో పేర్ని జయసుధకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దాంతో బియ్యం షార్టేజ్కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ నష్టపరిహారం 1.79 కోట్ల డీడీని ప్రభుత్వానికి ఆమె వెంటనే చెల్లించారు. అయితే ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చెయ్యడం పేర్ని భార్య జయసుధ ను అరెస్ట్ చెయ్యడానికి చూడటంతో ఆమె హైకోర్టు కు వెళ్ళటం అక్కడ ఊరట లభించడం జరిగింది
