సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతన 2025 సంవత్సరం శుభ ప్రదంగా ఉండాలని , జిల్లా వ్యాప్తంగా ప్రజలు నేటి బుధవారం ఉదయం 6 గంటల నుండి భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అన్ని రంగాలలో అభివౄద్ధి పధంలో పయనించాలని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ C నాగరాణి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ మర్యాదలతో .ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభంతో స్వాగతంపలికి పూజలు నిర్వహించినారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలుఅందజేశారు. .పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ శాఖ D E O సుబ్బారావు పాల్గొన్నారు. నెల రోజుల పాటు జరిగే శ్రీ అమ్మవారి వార్షికోత్సవాలు సందర్భముగా జరుగుతున్నా ఏర్పాట్లను కలెక్టర్ కొద్దీ సేపు పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *