సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఊహించని విధంగా కొత్త ఏడాది ప్రారంభం రోజునే బంగారం (gold), వెండి (silver) ధరలు దేశంలో పెరిగిపోయాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం గత ముగింపు ధర రూ.76162తో పోలిస్తే గత బుధవారం ధర రూ.76,583కి పెరగగా, మరోవైపు వెండి ధర గత ముగింపుతో పోలిస్తే రూ. 86,055కి పెరిగింది. ఈ రేటు నిన్న కిలో రూ.86017గా ఉంది. ఈ క్రమంలో గోల్డ్ రేటు 421 రూపాయలు పెరగగా, వెండి ధర కిలోకు 38 రూపాయలు మాత్రమే వృద్ధి చెందింది. అయితే జనవరి 2, 2025 నేడు గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభమయ్యే వరకు ఇదే ధరలు మరింత పెరిగాయి.. నేడు, తెలుగు రాష్ట్రాలలో ( హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో ) 10 గ్రాముల బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే .. 24 క్యారెట్లు ధర 77560 రూ , 22 క్యారెట్లు,ధర 71100 రూ 18 క్యారెట్ల బంగారం ధర 58180 లకు కొనుగోళ్లు జరుగుతున్నాయి.
