సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి నుండి ‘తిరుమల’ తిరుపతి పవిత్ర వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శన టోకెన్ ల కోసం గత చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది! ఈ విషాదంలో 40 మంది పైగా గాయపడగా ఇప్పటికి 6 గురు భక్తులు మృతి చెందటం జరిగింది. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ… తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ చోటు చేసుకున్నాయి. నేటి గురువారం తెల్లవారు జాము వంటి గంట నుంచి తిరుమల తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ జారీ కౌంటర్ భక్తులకు తొక్కిసలాటలో నరకం చూపించింది. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు.. తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ముందుగా బైరాగిపట్టెడ కేంద్రం భక్తులు ఎక్కువగా ఉన్నారని గత బుధవారం రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో.. పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. మహిళలు మరింత విలవిలలాడారు. ఒక మహిళా అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమెను రక్షించేందుకు పోలీస్ లు మరోసారి బయట గేటు తెరువాత మరింత మరింత మంది భక్తులు లోపలి తోసుకొనివచ్చినట్లు తెలుస్తుంది. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా.. వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో సుమారు 50 మంది భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో 20 మంది ని డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తుంది. టీటీడీ నిర్వహణ చరిత్రలోనే ఇది మాయని మచ్చలా మిగిలిపోనుంది!
