సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని, సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసివి పండుగలేనని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. నాటి సంస్కృతి సంప్రదాయాలు ఆ తరానికే కాకుండా నేటి తరానికి తెలియజేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. కళాశాల అధ్యక్షులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఏడాది తమ కళాశాలల్లో విద్యార్థులతో సంప్రదాయ బద్దంగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి మెంటే రామ్ మనోహర్, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, డా తోట రామ్మూర్తి, డా కవల నాగేశ్వర్రావు, డా గంగాధర్, డా రాఘవ, నాచు శ్రీవల్లి, వబిలిశెట్టి కనకరాజు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
