సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR సినిమా తరువాత 4 ఏళ్ళు షూటింగ్ జరుపుకొని రామ్ చరణ్ హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో గేమ్ చేంజెర్’ సినిమా నేడు, శుక్రవారం పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల భారతీయుడు2 ఘోర పరాజయం తరువాత శంకర్‌కు సినిమా’గేమ్ చేంజర్’పై హైప్ డౌన్ అవుతూ వచ్చింది. సినిమా కు భారీ ఓపెనింగ్స్ ఫై దాని ప్రభావం చుపిందనే చెప్పాలి. అయితే ట్రైలర్ బాగా కట్ చెయ్యడం .. మరోవైపు దిల్ రాజు.. ఫస్ట్ టైమ్ ఈ సినిమా కోసం వందల కోట్లు పెడుతుండటం.. పాటలకే 75 కోట్లు ఖర్చుపెట్టారనే వార్తలతో కాస్త హైప్ పెరిగింది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. సినిమా కధ విషయానికి వస్తే.. ఉత్తర ప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న రామ్ నందన్ (రామ్ చరణ్), తన ప్రియురాలు దీపిక (కియారా అద్వాణీ) కు ఇచ్చిన మాట ప్రకారం ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యి, తన సొంత జిల్లా వైజాగ్‌‌కు కలెక్టర్‌గా వస్తాడు. వైజాగ్ వచ్చీ రాగానే అక్కడ ఉన్న రౌడీ షీటర్స్‌కి, రాజకీయ నాయకుల అరాచకాలను అదుపులో పెట్టేక్రమంలో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య)కి, రామ్ నందన్‌కి మధ్య వార్ మొదలవుతుంది. మరోవైపు తన తండ్రి సీఎం సత్యమూర్తి (శ్రీకాంత్) సీట్‌ కోసం మోపిదేవి చేయని ప్రయత్నాలు ఉండవు. ఈ క్రమంలో సీఎం సత్యమూర్తి ఎలా చనిపోయాడు? ఆయన చనిపోతూ తన కొడుకుని కాదని.. రామ్ నందన్‌‌కి సీఎం సత్యమూర్తి బాధ్యతలను ఎందుకు అప్పగించాడు? అసలు అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి) ఎవరు? రామ్ నందన్‌ కథలో పాత్రలు ఏమిటి? అనేది ఈ సినిమాలో చూడాల్సిందే. ఇక ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా.. కాలేజ్‌లో యాంగ్రీ మ్యాన్‌గా, ప్రజా ఉద్యమం చేసే అప్పన్నగా.. మొత్తంగా మూడు రకాల పాత్రలలో రామ్ చరణ్ రాణించాడు. మరీ ముఖ్యంగా అప్పన్న పాత్రకు నత్తి తో మాట్లాడుతూ నట విశ్వరూపం చూపించారు.యాక్షన్, డ్యాన్సుల్లో తనదైన సత్తా చూపించారు చరణ్.. ఈ సినిమాకు మరో ఎస్సెట్ ఎస్.జె. సూర్య. విలనిజంలోనే కామిడి పుట్టించాడు. కియారా పాటలకు పరిమితమైంది. సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల నరేష్, వెన్నెల కిశోర్ కొద్దీ సీన్లకు పరిమితమయ్యారు. ఈ సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. పొలిటికల్ డైలాగ్స్ బాగున్నాయి. అయితే ఒకటి తక్కువయ్యింది. కధనం ప్రేక్షకుడి కి ముందే తెలిసిపోతుంది. సినిమా లో శంకర్ గత సినిమాల తరహా సన్నివేశాల చిత్రీకరణ పట్టు తగ్గింది. ట్రాక్ తప్పాడు . ఎక్కువ అంచనాలతో వెళ్ళితే నిరాశ కలుగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *