సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చలికాలం లో సైతం ఏపీలో గతంలో ఎప్పుడు లేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం.. సరిగ్గా సంక్రాంతికి వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం చెబుతోంది. బంగాళాఖాతంలో మరోసారి ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉందని చెబుతున్నారు. ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తర కోస్తాలో మాత్రం మరో రెండ్రోజులు పొడి వాతావరణం ఉండనుంది. ఏపీలో చాలా చోట్ల మరో మూడు, నాలుగు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వెదర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.అటు తమిళనాడు, పుదుచ్చేరిలకు కూడా వర్షాలు పడనున్నాయి.
