సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎ.పి.కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య నేడు, శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 97 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చర్యలు లేవని, కూటమి సర్కారు ఇప్పటికయినా కళ్లు తెరిచి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, హామీలేని పంట రుణాలు ఇవ్వాలని, కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొన్న ఎన్నికల ప్రచార హామీల్లో చంద్రబాబు నాయుడు రైతాంగానికి పెట్టుబడి సాయం ఇరవై వేలు అందిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. ఖరీఫ్ కు బీమా ప్రీమియం ప్రభుత్వం చెల్లించిందని, రబీ ప్రీమియం రైతులే కట్టుకోవాలని చెప్పడం దారుణమని ఆయన విమర్శించారు. అధికారం చేపట్టి ఏడు నెలలు దాటిందని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలకు ఎక్సుగ్రేషియో ప్రకటించలేదని జమలయ్య ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, రైతు సంఘం నాయకులు ఎం.లక్ష్మిపతి, తదితరులు పాల్గొన్నారు.
