సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి సినిమాలు లో మంచి ట్రాక్ రికార్డు కు తోడు ఇటీవల వరుసగా హ్యాట్రిక్ విజయాలతో దూసుకొనిపోతున్న నందమూరి నటసింహం బాలయ్య ‘డాకు మహారాజ్’గా నేడు, ఆదివారం తెల్లవారు జాము నుండి థియేటర్లలోకి వచ్చేసాడు. ఆల్రెడీ కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ షో స్ పూర్తయ్యాయి. ‘ ఈ సంక్రాంతికి మాస్ ఎలివేషన్స్‌కి గత వాల్తేర్ వీరయ్య తో కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ బాబీతో కలిసి ఆయన థియేటర్లలోకి మంచి మాస్ అంచనాలతో వచ్చేసాడు. ఇంతకీ సినిమా టాక్ ఎలాఉండటే ఒక్క మాటలో.. ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అంతే ..సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మినిహా బాగా తీశారు ..అంటున్నారు. నిజంగా గతంలో చుసిన బాలయ్య సినిమాలకు ఈ సినిమా కు చాల తేడా ఉందని.. మాస్ సన్నివేశాలను కూడా మంచి క్లాస్ గా దర్శకుడు బాబీ కెమెరామెన్ ఎలివేట్ చెయ్యగా బాలయ్య అభిమాని తమన్ సంగీతం మరో రేంజ్ లో అదరగొట్టేసాడు అంటున్నారు.. 60 ప్లస్ లో కూడా బాలయ్య గుర్రపు స్వారీ సన్నివేశాలు , ఫైట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయంటున్నారు. అయితే సెంకడ్ హాఫ్ హింస ఎక్కువ తియ్యడం, ఫ్యామిలీ ఆడియన్స్ కు కాస్త కష్టంగా ఉంటుందని టాక్. విలన్ గా బాబీ డియోల్ అదరగొట్టిన చివరి సన్నివేశాలలో సో సో.. మొత్తానికి మాస్ సినిమాగా బాలయ్య అభిమానులకు పండుగే.. దాకు మహారాజ్ కలెక్షన్స్ కొల్లగొట్టడంలో ఎటువంటి రికార్డ్స్ సాదిస్తాడో ? రేపటి వెంకీ మామ ‘సంక్రాంతి కి వస్తున్నాం రిజల్ట్ తో తేలిపోతుంది.
