సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికి గుర్తుకువచ్చేది భీమవరం.. అక్కడ శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు తోడు తిరునాళ్లను తలపించే కోడి పందాలు..ఇది తరతరాలుగా సంక్రాంతి సంప్రదాయం అని ఇక్కడి వారు భావిస్తారు. భీమవరం వచ్చేవారికి సంక్రాంతి సినిమాలు, ఉచిత ప్రవేశం ఉన్న రాయల్ క్రాఫ్ట్ బజార్, ఎగ్జిబిషన్ అదనపు వినోద బోనస్ లు. రేపటి సోమవారం నుండి ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే బంధువులు ప్రముఖులు వారికీ విందు వినోదాలతో పాటు ఆ 3 రోజులు కోడిపందాలు చూడటం అదో పండుగ మజా .. ఎప్పటిలానే సంక్రాంతి రోజుల్లో కోడిపందేలపై ఉక్కు పాదం మోపుతాం .. జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ.. ప్రజలు మంచి కోరి పోలీసు అధికారులు చేసే హెచ్చరికలు చేస్తున్నప్పటికీ సంప్రదాయం చాటున ఈసారి కూడా కోడిపందాలు బరులకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఈసారి భీమవరం ,ఉండి నియోజక వర్గ పరిధిలో పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున కోళ్లు తలపడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ బరులు సిద్ధం చేసుకొని ప్రస్తుతం అక్కడ సంక్రాంతి సాంసృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ ప్రముఖులతో మ్యూజికల్ నైట్ లు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ పండుగ రోజులలో భీమవరం ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా సహకరించుకొంటారని అందరికి తెలిసిందే. ఇక చోటా మోట నేతల ఆధ్వర్యంలో కోడి పందాల బరులుకు, డింకీ పందాలకు భీమవరం పట్టణంలోని శివారు ప్రాంతలతో పాటు పెదగరువు, పాలకోడేరు, ఉండి, కాళ్ల మండలాల్లోని పలు ప్రాంతాలు ప్రసిద్ధి పొందాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు భీమవరం చేరుకొని హోటల్స్ , గెస్ట్ హౌస్ లలో దిగుతున్నారు.అయితే ఈ సారి కోనసీమలో కూడా భారీ కోడిపందాలు బరులు ఏర్పట్లు జరుగుతున్నాయి. అయితే ఇటీవల కొంతకాలంగా వ్యాపారాలు బాగా లేకపోవడం, స్థానిక ప్రజలు ఆదాయాలు తగ్గటంతో కిస్మస్ సంక్రాంతి సీజన్ కూడా మార్కెట్ నిస్తేజంగా ఉండటంతో ఈ సంక్రాంతి పండుగ కు భీమవరం లో ఎలాంటి జోష్ ఉంటుందో నని సందేహం వ్యక్తం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *