సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఎప్పటి నుండో కోరుతున్న భీమవరం ప్రభుత్వాసుపత్రికి రూ.24కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్‌ను మంజూరు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తెలిపారు. స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రి ప్రాంగణంలో రూ.1.99కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఓపీ విభాగాన్ని, కిడ్నీ రోగుల కోసం రూ.65లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు పడకల డయాలసిస్ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజుతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలు పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సహాయాలపై వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన వైద్య, టెక్నికల్ తదితర సిబ్బందిని కూడా ఏర్పాటుచేసిన దాత దాట్ల సత్యనారాయణరాజు అభినందనీయులన్నారు. ఉద్దానంలో సుమారు 34వేల కిడ్నీ కేసులున్నాయని, సీకేడిగా మారకుండా నిరంతర సేవలను అందించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. . సర్వే నివేదికలను రెండు నెలలు అధ్యయనం చేసి రానున్న ఆరు నెలలో క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఈ సందర్భముగా తన విజ్ఞప్తి ని మన్నించి భీమవరం ప్రభుత్వాసుపత్రికి రూ.24కోట్ల రూ మంజూరు చేసిన మిత్రుడు మంత్రి వై.సత్యకుమార్ ను అభినందిస్తూ స్థానిక ఎంపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఒక వీడియోను విడుదల చేసారు.
