సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి నుండి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన దక్షిణ రైల్వే ఇంకా పండగ రోజుల్లో మరింత పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో 36 ప్రత్యేక రైళ్లను నడపాలని తాజగా నిర్ణయించింది. వాటిలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, అలాగే హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య సైతం మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.ఈ రైళ్లు ఆకివీడు, భీమవరం Town , తణుకు, మీదుగా నడపనున్నారు.కాకినాడ నుంచి 07022 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ నేటి ఆదివారం సాయంత్రం 05.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక మరో ప్రత్యేక రైలు నెంబరు 07023 నేడు, జనవరి 12వ తేదీ సాయంత్రం 06.30 గంటలకు హైదరాబాద్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు కాకినాడ నగరానికి చేరుకోంటుంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13వ తేదీ రాత్రి 10.00 గంటలకు కాకినాడ పట్టణం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
