సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక DNR ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నేడు, ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు , కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) ,ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు ,అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణంరాజు,మరియు గంగిపాముల భాస్కర్ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు వక్తలు మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి విద్యార్థుల జీవితాలలో కొత్త క్రాంతులను తీసుకురావాలని సంక్రాంతి లక్ష్మి మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అన్నారు తమ కళాశాలలో విద్యార్థులకు రంగవల్లిలు పోటీలు, సాంప్రదాయక వస్తదారణ ,గంగిరెద్దుల కోలాహలం ,ఉత్సాహ ఆహ్లాద వాతావరణాన్ని తమ కళాశాలకు ముందుగా పండుగ వాతావరణం వచ్చేసిందని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న పదహారణాల తెలుగింటి ఆడపిల్లల్లాగా కోలాహలం ఎంతో ఘనంగా సంక్రాంతిని నిర్వహించమన్నార: రంగవల్లి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రధాన ఉత్సవం చేశారు
