సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం , వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల (Pulivendula) డీఎస్పీ మురళీనాయక్ ను హెచ్చరించారు. నిన్న (ఆదివారం) తన సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి అంత్యక్రియల సందర్భంగా పులివెందులకు జగన్ వచ్చారు. కార్యక్రమం అనంతరం వెళ్లిపోయే సమయంలో తన హెలీప్యాడ్ వద్దకు వచ్చిన డీఎస్పీ మురళీనాయక్‌ను జగన్ నిలదీశారు. ఇటీవల సోషల్ మీడియా పోస్ట్ ల విచారణ పేరుతో వైసీపీ కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. వారిని వేధిస్తావా? ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి విషయంలో తప్పు చేస్తున్నావంటూ ,అధికార టీడీపీ పార్టీ ఒత్తిడికి వంగి మీరు నమోదు చేస్తున్న కేసులన్నీ తప్పుడు కేసులేనని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మారకపోతే భవిష్యత్తులో దారుణ పరిస్థితులు ఎదుర్కొంటావంటూ DSP ని హెచ్చరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని, నిన్ను వదిలిపెట్టేది లేదంటూ డీఎస్పీ మురళీ నాయక్ ను జగన్ తీవ్ర్ స్థాయిలో హెచ్చరించినట్లు వార్త సమాచారం.
