సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 61వ వార్షికామహోత్సవాలు నేడు, సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి తెల్లవారు నుండి శ్రీ అమ్మవారి కి నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం , ఉత్సవ కమిటి అద్యక్షులు రామాయణం గోవిందరావు దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పుష్ప అలంకరణ చేసారు. ఇక మహోత్సవాలు ప్రారంభంగా నేటి మధ్యాహం శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ విగ్రహంతో నగరోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, ఆలయ సహాయ కమిషనర్, బుధ్హ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. .డప్పు వాయిద్యాలతో , మేళతాళాలతో బాణాసంచా కాల్పులతో కళాకారుల ప్రదర్సనలతో పుష్ప రధం ఫై శ్రీ అమ్మవారి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు.
