సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం లోని ప్రజలు తమ భవిషత్ ఆర్థిక అభివృద్ధి అంచనాలు కోసం బడ్జెట్ కోసం ఎంతగా ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే. మరి తాజగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఖరారయ్యారు. రెండు విడతలుగా జరిగే ఈ సమావేశాల్లో తొలి విడత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. పార్లమెంటు సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈనెల 31న పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభవుతాయి. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 5న, రవిదాస్ జయంతి నేపథ్యంలో ఫిబ్రవరి 12న పార్లమెంటు కార్యకలాపాలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *