సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం గా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో గత ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి గత పదిరోజుల పాటు టీటీడీ అధికారులు భక్తులకు ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ పది రోజుల్లో దాదాపు 6 లక్షల 83 వేల 304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గతేడాది తరహాలోనే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. చివరిగా ఆదివారం అర్ధరాత్రి ఏకాంతసేవతో వైకుంఠ ద్వారాలను మూసివేశారు. ఇక నేటి సోమవారం తెల్లవాఱుజామునుండి యధావిధిగా శ్రీవారి దర్శనాలు ప్రారంభమయ్యాయి. గత ఏడాది ము క్కొటి నుండి 10 రోజులలో 6 లక్షల 47 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం గమనార్హం.
