సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి సినీ రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి , మాజీ ఎంపీ , స్వర్గీయ కీ. శే. కృష్ణంరాజు గారి జన్మదినం సంధర్బంగా వారి సతీమణి శ్యామల దేవి ఆధ్వర్యంలో భీమవరం DNR కళాశాల గన్నాబత్తుల వారి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన షుగర్ వ్యాధిగ్రస్తుల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నేడు, సోమవారం ఉదయం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, జిల్లా కలెక్టర్ నాగరాణి, మాజీ రాజ్యభ సభ్యులు తోట సీత రామలక్ష్మి సంయుక్తంగా ప్రారంబించారు. కృష్ణంరాజు జన్మదినం వేడుకలు భారీ కేక్ కోసి వేడుక జరుపుకొన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు అభివృద్ధి కి ఎంపీగా కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు చేసిన సేవల ను స్మరించుకొని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళిలర్పించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో DNR కళాశాలల పాలకవర్గం ఉమ్మడి పశ్చిమగోదావరి జనసేన అడ్జక్షుడు చినబాబుతో పాటు రాజకీయాలకు అతీతంగా పలువురు టీడీపీ జనసేన బీజేపీ , వైసీపీ నేతలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా హీరో ప్రభాస్ అభిమానులు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
